ఢిల్లీ లిక్కర్ స్కాం కేసులో ట్విస్ట్
దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఢిల్లీ లిక్కర్ స్కాంలో ఢిల్లీ ముఖ్యమంత్రి.. ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్,బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవితతో పాటు పలువురు తీహార్ జైల్లో ఉన్న సంగతి తెల్సిందే. ఇదే కేసులో పదిహేడు నెలల కిందట అరెస్ట్ అయిన ఢిల్లీ మాజీ ఉప ముఖ్యమంత్రి మనీష్ సిసోడియా ఇటీవల బెయిల్ పై బయటకు వచ్చిన సంగతి విధితమే.
నిన్న సోమవారం సుప్రీంకోర్టులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత వేసిన పిటిషన్ ను విచారించకుండా వాయిదా వేసిన సంగతి కూడా తెల్సిందే. తాజాగా ఢిల్లీ రౌస్ అవెన్యూ కోర్టు ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్,ఎమ్మెల్సీ కవిత రిమాండ్ ను వచ్చే నెల సెప్టెంబర్ రెండో తారీఖు వరకు పొడిగించింది.
ఇప్పటికే ఈ కేసులో ఎలాంటి ఆధారాలు లేవు.. నిందితులను ఆధారాల్లేకుండా విచారణ పేరుతో జైల్లో ఉంచకూడదు. బెయిల్ ఈజ్ రూల్ జైల్ ఈజ్ ఎగ్జంప్షన్ .. స్పీడ్ ట్రైల్ కిందట ఎవరైతే నింధితులుగా ఉన్నారో వారికి బెయిల్ ఇవ్వాలని సుప్రీం కోర్టు తీర్పునిచ్చిన తర్వాత కూడా తాజాగా రౌస్ అవెన్యూ కోర్టు రిమాండ్ ను పొడిగించడం ప్రాధాన్యతను చోటు చేసుకుంది.