TDP MLC అభ్యర్థిగా దిలీప్
Byra Dilip Chakravarthy as TDP MLC candidate
![]()
ఏపీలో త్వరలో జరగనున్న వైజాగ్ స్థానిక సంస్థల ఎమ్మెల్సీ ఉప ఎన్నికల్లో వైసీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా మాజీ మంత్రి.. మాజీ ఎమ్మెల్యే బొత్స సత్యనారాయణను ఆ పార్టీ అధినేత.. మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి ప్రకటించిన సంగతి తెల్సిందే.. నిన్న సోమవారం మాజీ మంత్రి బొత్స సత్యనారాయణ ఎమ్మెల్సీ అభ్యర్థిగా నామినేషన్ కూడా దాఖాలు చేశారు..
మరోవైపు టీడీపీ ఎమ్మెల్సీ అభ్యర్థిగా ఎవర్ని ఎంపిక చేయాలనే సంధిగ్ధంలో ఆ పార్టీ అధినేత.. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నట్లు తెలుస్తుంది.. అయితే మరోవైపు ఈ స్థానం కోసం మాజీ ఎమ్మెల్యేలు పీలా గోవింద్, గండి బాబ్జి ల పేర్లు తెరపైకి వచ్చాయి..
కానీ చంద్రబాబు మాత్రం ప్రముఖ వ్యాపారవేత్త.. ఇటీవల జరిగిన ఎన్నికల్లో టికెట్ ఆశించి భంగపడ్డ బైరా దిలీప్ చక్రవర్తి పేరును ఖరారు చేసినట్లు సమాచారం..కాగా అనకాపల్లి నుండి టికెట్ ఆశిస్తే చంద్రబాబు అధికారంలోకి వచ్చాక ప్రాధాన్యత కల్పిస్తానని అప్పట్లో హామీ ఇచ్చారు…