వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

 వైసీపీకి మాజీ ఎమ్మెల్యే రాజీనామా

YSR Congress Party

ఏపీ ప్రతిపక్ష వైసీపీకి గట్టి షాక్ తగిలింది. ఇప్పటికే ఆ పార్టీకి చెందిన నేతలు.. కార్యకర్తలపై రాష్ట్ర వ్యాప్తంగా అనేక దాడులు జరుగుతున్న సంగతి తెల్సిందే. తాజాగా ఆ పార్టీకి చెందిన పిఠాపురం అసెంబ్లీ నియోజకవర్గ మాజీ ఎమ్మెల్యే పెండెం దొరబాబు ఆ పార్టీకి రాజీనామా చేస్తున్నట్లు ప్రకటించారు.

ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో దొరబాబును కాదని వంగ గీతకు ఆ పార్టీ ఆధిష్టానం టికెట్ ను ఖరారు చేసింది. ఈ క్రమంలోనే దొరబాబుకు తీవ్ర అవమానం జరిగినట్లు ఆయన అనుచరులు వాపోతున్నారు. రాజీనామా అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ” ఐదేండ్లు అధికారంలో ఉన్న కానీ ఏనాడు ఎలాంటి అవినీతి అక్రమాలకు పాల్పడలేదు.

ఇటీవల జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో టికెట్ వేరేవాళ్లకు ఇచ్చిన వారి గెలుపు కోసం తీవ్రంగా శ్రమించాను. వారి కోసం అహర్నిశలు పని చేశాను. నేను ఏ పార్టీలో ఉన్న కానీ ఆ పార్టీ బలోపేతం కోసమే పని చేశాను” అని ఆయన సంచలన వ్యాఖ్యలు చేశారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *