ఉచిత పథకాలపై రేవంత్ రెడ్డి కీలక వ్యాఖ్యలు
తెలంగాణ కు పెట్టుబడులు తీసుకురావాలనే లక్ష్యంతో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అమెరికాలో పర్యటిస్తున్న సంగతి తెల్సిందే.. ఈ పర్యటనలో భాగంగా న్యూజెర్సీ లో ఎన్నారైలతో జరిగిన ఓ కార్యక్రమంలో ఆయన ముఖ్య అతిథిగా పాల్గొన్నారు..
ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ ప్రభుత్వాలు ఉచిత పథకాలు తీసుకొచ్చేది పేదలను ఆర్థికంగా బలోపేతం చేయడానికి.. సామాజికంగా ఆర్థికంగా వారికీ అండగా ఉండి సమాజంలో తల ఎత్తుకునేలా జీవించడానికి ప్రభుత్వం ఉచిత పథకాలను అమలు చేస్తుంది.
అందుకే తెలంగాణలో అధికారంలోకి వచ్చిన వంద రోజుల్లోనే మహిళలకు ఉచిత ప్రయాణం కల్పించాము.. ఇటీవల రైతు రుణమాఫీ మొదలెట్టాము.. ఉచితంగా కరెంటు ఇస్తున్నాము.. ఇలాంటి ఉచిత పథకాలను లక్షల జీతాలు తీసుకునేవారు.. సంపన్నులు వదులుకుంటే మరింత మంది పేదలకు మనం మంచి చేసినవాళ్ళం అవుతామని కీలక వ్యాఖ్యలు చేశారు..