అమెరికాకు బయలుదేరిన సీఎం రేవంత్ రెడ్డి
అమెరికా పర్యటన నేపథ్యంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి జూబ్లీహిల్స్ లోని తన నివాసం నుండి ఈ రోజు ఉదయం బయలు దేరి వెళ్లారు. ముఖ్యమంత్రితో పాటు మంత్రి దుద్దిళ్ల శ్రీధర్ బాబు తో పాటు అయా శాఖల ఉన్నతాధికారులు కూడా వెళ్లారు.
రాష్ట్రానికి పెట్టుబడులే తీసుకురావడమే లక్ష్యంగా రేవంత్ రెడ్డి అమెరికా వెళ్తున్నారు. ఈ పర్యటనలో న్యూజెర్సీ,న్యూయార్క్,వాషింగన్ డీసీ,శాన్ ఫ్రాన్సిస్కో ప్రాంతాల్లో వీరు పర్యటించనున్నారు.
అక్కడ నుండి దక్షిణకొరియో రాజధాని మహానగరం సియోల్ లో రెండు రోజుల పాటు పర్యటించి ఈ నెల పద్నాలుగు తారీఖున రాష్ట్రానికి తిరిగి రానున్నారు.