కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదు
తెలంగాణ వ్యాప్తంగా కాంగ్రెస్ పాలనలో మహిళలకు రక్షణ లేదని మాజీ మంత్రి… బీఆర్ఎస్ ఎమ్మెల్యే పటోళ్ల సబితా ఇంద్రారెడ్డి ఆరోపించారు.. తెలంగాణ భవన్ లో నిన్న గురువారం మీడియా సమావేశంలో మాట్లాడుతూ “ఒకప్పుడు హైదరాబాద్ మహానగరంలో అర్ధరాత్రి పన్నెండు గంటలైన కానీ మహిళలు స్వేచ్ఛగా తిరిగేవారు. కానీ నేడు పట్టపగలు కూడా క్షేమంగా ఇంటికి తిరిగి రావడంలేదు..
ఉదయం ఒక అత్యాచారం సంఘటన జరుగుతుంది.. మధ్యాహ్నం ఒకటి జరుగుతుంది.. ఇంటికి వచ్చి టీవీ పెడితే ఒకటి రెండు మూడు అంటూ లెక్కపెట్టాల్సి వస్తుంది.. ఒకప్పుడు ఒక సంఘటన జరిగితేనే హంగామా చేసేవాళ్ళు ఇప్పుడు ఇన్ని ఘోరాలు జరుగుతున్నా కనీసం సప్పుడు లేదు అని ఆమె ఆరోపించారు..
ఆమె ఇంకా మాట్లాడుతూ “కాంగ్రెస్ పాలనలో అన్ని వర్గాలు కష్టాల్లో కూరుకుపోయారు.. మంత్రులు ఎవరో తెల్వదు.. ఏ శాఖ ఏంటో కూడా తెల్వని వాళ్ళు మంత్రులుగా ఉన్నారు.. ఇంతవరకు హోమ్ మంత్రి లేరు.. విద్యాశాఖ మంత్రి అసలే లేరు “అని ఆమె సంచలన వ్యాఖ్యలు చేశారు.