రేషన్ కార్డులు లేనివారికి అలెర్ట్

 రేషన్ కార్డులు లేనివారికి అలెర్ట్

తెలంగాణ వ్యాప్తంగా కొన్ని లక్షలమంది కొత్త రేషన్ కార్డుల కోసం ఎదురుచూస్తున్న సంగతి తెల్సిందే.. అంతే కాకుండా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం అమలు చేస్తున్న రుణమాఫీ కార్యక్రమం కూడా రేషన్ కార్డు లేకపోవడంతో రైతులు ఆందోళనలో ఉన్నారు..

వీరికి ఓ శుభవార్తను తెలిపింది రాష్ట్ర ప్రభుత్వం.. అందులో భాగంగా ఎవరైతే రేషన్ కార్డు లేక రుణమాఫీ కాక బ్యాంకుల చుట్టూ తిరుగుతున్నారో వాళ్ళు కంగారు పడాల్సిన పనీలేదు. త్వరలోనే అధికారులు ఇండ్లకు వెళ్లి వారి వివరాలను తీసుకుంటారు..

తధ్వారా రుణమాఫీ ప్రక్రియను పూర్తి చేస్తారు అని ప్రభుత్వం రేషన్ కార్డు లేని రైతులకు ప్రభుత్వం భరోసానిచ్చింది..ఇప్పటివరకీ దాదాపు లక్షన్నర రూపాయల వరకు రుణమాఫీ ప్రక్రియ పూర్తయిన సంగతి తెల్సిందే..

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *