గవర్నర్ గా జిష్ణు దేవ్ వర్మ ప్రమాణ స్వీకారం
తెలంగాణ రాష్ట్ర నూతన గవర్నర్ గా జిష్ణుదేవ్ వర్మ చేత రాష్ట్ర హైకోర్టు ప్రధాన న్యాయమూర్తి గౌరవ జస్టిస్ అలోక్ ఆరాధే పదవీ ప్రమాణ స్వీకారం చేయించారు.
రాజ్ భవన్ వేదికగా బుధవారం సాయంత్రం జరిగిన ఈ కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి , కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి , శాసనమండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి , స్పీకర్ ప్రసాద్ కుమార్ , డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క , రాష్ట్ర మంత్రివర్యులు, ఎమ్మెల్యేలు, ఎమ్మెల్సీలు, ఉన్నతాధికారులు పలువురు హాజరయ్యారు.