దివ్యాంగురాలిపై పైశాచికం

 దివ్యాంగురాలిపై పైశాచికం

మానసిక దివ్యాంగురాలిపై దుండగుడు లైంగికదాడి జరిగిన సంఘటన ఒకటి వెలుగులోకి వచ్చింది..రాష్ట్రంలోనినల్లగొండ – శాలిగౌరారం మండలం శాలిలింగోటంలో బాధితురాలి తండ్రితో నిందితుడు దశరథ కలిసి పనికి వెళ్లేవాడు.

పనిలో భాగంగా నిత్యం వారింటికి వస్తూ పోతున్న క్రమంలో ఒంటరిగా ఉంటున్న దివ్యాంగురాలిపై కన్నేశాడు. కుటుంబసభ్యులు పనికి వెళ్లిన విషయం తెలుసుకొని ఆ ఇంటికి వెళ్లిన దశరథ.. దివ్యాంగురాలిపై లైంగికదాడికి పాల్పడ్డాడు.

సాయంత్రం ఇంటికి వచ్చిన తల్లిదండ్రులకు బాధితురాలు విషయం చెప్పడంతో పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేశారు.వెంటనే నిందితుడిని అదుపులోకి తీసుకొని విచారణ చేపట్టారు.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *