రేవంత్ రెడ్డికి ఒవైసీ వార్నింగ్
తెలంగాణ అసెంబ్లీ బడ్జెట్ సమావేశాల్లో పద్దులపై చర్చ సందర్భంగా ఓ ఆసక్తికరమైన సంఘటన చోటు చేసుకుంది.. అసెంబ్లీ సమావేశాల్లో పద్దులపై చర్చలో భాగంగా ఎంఐఎం ఎమ్మెల్యే అక్బరుద్దీన్ ఒవైసీ మాట్లాడుతూ ” హైదరాబాద్ మహానగరంలో నగర వ్యాప్తంగా పదిన్నారకే అన్ని వ్యాపార సంస్థలు మూసేయాలి..
కానీ పోలీస్ కమండ్ సెంటర్ ఎదురుగా ఉన్న నీలోఫర్ కేఫ్, వైన్ షాపులు మాత్రం పన్నెండు గంటల దాక తెరిచే ఉంటాయి.. సామాన్యులకు ఒక న్యాయం.. పోలీస్ అధికారులకు ఒక న్యాయమా అని “అయన ప్రశ్నించారు.. ఇదేనా మీ బాధ్యత.. కర్తవ్యం.
ఐటీ ఉద్యోగులు, చిరు ఉద్యోగులు, గరీభోల్లా పిల్లలు పదిన్నర కు రాత్రి పూట రోడ్లపై కన్పిస్తే పోలీసులు లాఠీ ఛార్జ్ చేసి కొడుతున్నారు.. ఇదేవిధంగా మన ఎమ్మెల్యేలకు సంబంధించిన పిల్లలను ఆలా కొడతారా.?.. ఇప్పటికైనా మారండి.. మీ విధులను సక్రమంగా నిర్వర్తించండి.. లేకపోతే హరీష్ రావు తో కల్సి హైకోర్టులో ఫిల్ వేస్తామని రేవంత్ రెడ్డి సర్కారుకు వార్నింగ్ ఇచ్చారు.