రేవంత్ రెడ్డి పై పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు
మూసీ నది ప్రక్షాళన కోసం లక్ష నూట యాభై వేల కోట్లను కేటాయిస్తామని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చేసిన వ్యాఖ్యలపై సీనియర్ జర్నలిస్ట్ పాశం యాదగిరి కీలక వ్యాఖ్యలు చేశారు. మీడియా తో మాట్లాడిన పాశం యాదగిరి రైతులకు రుణమాఫీ చేయలేనోడు మూసీ నది ఎలా ప్రక్షాళన చేస్తారు అని ప్రశ్నించారు..
రుణమాఫీ కోసం ముప్పై వేల కోట్లను తీసుకురాలేనోడు. మూసీ నది కోసం లక్ష యాభై వేల కోట్లను ఎక్కడ నుండి తీసుకువస్తాడు అని హేద్దేవా చేశారు..
ఇంకా మాట్లాడుతూ ముఖ్యమంత్రిని పోయి మూసీ నీళ్లతో మొఖం కడుక్కోమనండి..రైతులకు ఇవ్వడానికి పైసలు లేవు గాని, మూసీ సుందరీకరణ చేస్తావా??మూసీ కోసం లక్ష 50 వేల కోట్లు ఖర్చు చేస్తావా?? ఏడ నుంచి తెస్తావ్ పైసల్??చంద్రబాబు చెప్తేనే మంత్రివర్గ విస్తరణ జరుగుతుంది అని అన్నారు.