కాళేశ్వరం పనికిరాని ప్రాజెక్టు
తెలంగాణలో నాటి బీఆర్ఎస్ ప్రభుత్వం అత్యంత ప్రతిష్టాత్మకంగా నిర్మించిన కాళేశ్వరం ప్రాజెక్టు పనికిరాని ప్రాజెక్టు.. ఒక్క ఎకరాకు సాగునీళ్లు ఇవ్వలేదని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు..
మీడియాతో మాట్లాడుతూ కాళేశ్వరం డిజైన్ పై ఎఎస్డీఎనే ఆశ్చర్యపోయింది..కాళేశ్వరం ప్రాజెక్టును సాగునీళ్ల కోసం కాదు డబ్బుల కోసం నిర్మించారు.. సీతారామ,భక్తరామదాసు ప్రాజెక్టుల్లో కూడా అవినీతి జరిగింది..
కొత్త రేషన్ కార్డులు.ఆరోగ్య శ్రీ కార్డుల గురించి త్వరలోనే మార్గదర్శకాలను విడుదల చేస్తాము..ఒకేసారి రైతులకు రెండు లక్షల రుణమాఫీ చేసిన చరిత్ర మాది అని ఆయన ఉద్ఘాటించారు..