రుణమాఫీ లెక్క తప్పింది గురుజీ
తెలంగాణ వ్యాప్తంగా నేడు గల్లీ నుండి హైదరాబాద్ సచివాలయం వరకు రైతు రుణమాఫీ వేడుకలు చేయాలని ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి,డిప్యూటీ సీఎం భట్టి విక్రమర్క మల్లు సమక్షంలో జరిగిన ప్రజాప్రతినిధులు,పార్టీ నేతల సమావేశంలో అందిన ఆదేశాలు..దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఈ రోజు ఉదయం నుండే సీఎం..డిప్యూటీ సీఎంల చిత్రపటాలకు పాలాభిషేకాలు మొదలయ్యాయి..పిల్ల పుట్టకముందే కుల్లా కుట్టినట్లు ఉంది అని ప్రధాన ప్రతిపక్ష పార్టీ బీఆర్ఎస్ ఆరోపిస్తుంది..
తెలంగాణ ఏర్పడిన మొదట్లో అధికారంలోకి వచ్చిన నాటి అధికార నేటి ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ లక్ష లోపు రుణాలను మాఫీ చేయడానికి విడుదల చేసిన నిధులు అక్షరాల పదహారు వేల కోట్ల (16,000కోట్ల) రూపాయలు.. ఆ తర్వాత 2018లో అదే బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం చేసింది అక్షరాల పంతొమ్మిది వేల నూట తొంబై కోట్లు(19,198కోట్లు)..అయితే నిన్న బుధవారం జరిగిన సమావేశంలో గత ప్రభుత్వం లక్ష రూపాయల రుణమాఫీని చేయడానికి రైతుల ఖాతాల్లో జమచేసింది 12,000కోట్లు అని స్వయంగా ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి చెప్పిన మాటల వీడియో కూడా ఒకటి బయటకు వచ్చింది..అయిన జరిగిన సత్యం కూడా అదే..
మరి ఇప్పుడు లక్ష లోపు రుణాల మాఫీకోసం ఏడువేల కోట్లను విడుదల చేయడం ఏంటని రైతు సంఘాలు..ప్రతిపక్షాలు ప్రశ్నిస్తున్నాయి..పోనీ రైతు రుణమాఫీ వీళ్లకే చేస్తామని..చేస్తున్నామని కూడా ఎక్కడ మార్గదర్శకాల్లో కానీ చెప్పడం కానీ జరగలేదు..కనీసం సంబంధిత వ్యవసాయ శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావు కానీ ఫైనాన్స్ మంత్రి భట్టి కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి కానీ చెప్పింది లేదు. అయితే త్వరలో జరగనున్న స్థానిక సంస్థల,పంచాయితీ ఎన్నికల్లో లబ్ధి పొందడానికే ఇలా పబ్లిక్ స్టంట్లు చేస్తూ అరకొర రైతులకు రుణాలను మాఫీ చేస్తున్నారని రాజకీయ విశ్లేషకులు,రైతు సంఘాలు ,ప్రతిపక్షాలు ఆరోపిస్తున్నయి..
గత రెండు సార్లు బీఆర్ఎస్ ప్రభుత్వం రుణమాఫీ కోసం విడుదల చేసిన నిధులతో ప్రస్తుతం విడుదల చేసిన నిధులతో పోలిస్తే రైతు రుణమాఫీ లెక్క తప్పింది గురుజీ..పార్టీ వ్యూహాకర్త సునీల్ కనుగోలు పబ్లిక్ స్టంట్ పబ్లిక్ లో కాంగ్రెస్ సర్కారును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డిని నవ్వుల పాలు చేసిందని గుసగుసలాడుకుంటున్నారు..