గురుకుల ప్రిన్సిపాల్ పై సరస్వతి బంధువులు దాడి
సూర్యాపేట – పెన్ పహాడ్ మండలం దోసపహాడ్ బీసీ బాలికల గురుకుల పాఠశాల హాస్టల్లో అనుమానాస్పద ఐదవ తరగతి విద్యార్థిని కొంపల్లి సరస్వతి మృతి చెందడంతో కుటుంబ సభ్యులు ఆందోళనకు దిగారు.
తమ కూతురుకు జ్వరంగా ఉందని తీసుకెళ్ళమని చెప్పి అంతలోనే సూర్యాపేట ప్రభుత్వ ఆసుపత్రికి తీసుకెళ్తున్నాము.. అక్కడికి రమ్మని స్కూల్ ప్రిన్సిపాల్ చెప్పారు.
అక్కడికి వెళ్లే వరకే తమ కూతురూ చనిపోయి ఉందని కుటుంబసభ్యులు ఆందోళనకు దిగారు..ఈ క్రమంలో పాఠశాల ప్రిన్సిపాల్‌పై దాడికి దిగారు .. వీరికి మద్దతుగా వచ్చిన విద్యార్థి సంఘాల నాయకులు రూ.50 లక్షలు ఇచ్చి కుటుంబానికి న్యాయం చేయాలంటూ డిమాండ్ చేశారు.