పార్టీ మారాలని బీఆర్ఎస్ ఎమ్మెల్యేలకు బెదిరింపులు
బీఆర్ఎస్ కు చెందిన పది మంది ఎమ్మెల్యేలు..ఎనిమిది మంది ఎమ్మెల్సీలు ఆ పార్టీని వీడి అధికార కాంగ్రెస్ పార్టీలో చేరిన సంగతి తెల్సిందే.. అయితే బీఆర్ఎస్ పార్టీని వీడి కాంగ్రెస్ పార్టీలో చేరాలని తమ పార్టీకి చెందిన ఎమ్మెల్యేలను మభ్యపెట్టో..భయపెట్టో..వార్నింగ్ ఇచ్చి కాంగ్రెస్ కండువా కప్పుతున్నారని బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ అన్నారు.
నిన్న మంగళవారం బీఆర్ఎస్ నుండి కాంగ్రెస్ లో చేరిన ఎమ్మెల్యేలు..ఎమ్మెల్సీలపై సుప్రీంకోర్టు ఆదేశాలను అనుసరించి తక్షణమే చర్యలు తీసుకుని అనర్హత వేటు వేయాలని స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్ ను కల్సి విన్నవించారు వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ ఎమ్మెల్యేల బృందం..
ఈ సందర్భంగా కేటీఆర్ మాట్లాడుతూ “”ఒకవైపు ఏమో కాంగ్రెస్ పార్టీ భవిష్యత్తు అని చెప్పుకుంటున్న రాహుల్ గాంధీ రాజ్యాంగం చేతిలో పట్టుకొని పార్లమెంటులో ఫోజులు కొడుతున్నారు ..నేను రాజ్యాంగ సంరక్షుడిని అని.. బయటికి వచ్చేమో కాంగ్రెస్ పార్టీ కార్యాలయంలో పార్టీ ఫిరాయించిన తెలంగాణ బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్యేలకు వెన్నుతట్టి ప్రోత్సహించే విధంగా ప్రవర్తిస్తున్నారు.
కొన్ని రోజుల క్రితం ఒక యూట్యూబ్ ఛానల్లో స్పీకర్ గడ్డం ప్రసాద్ మాట్లాడుతూ ఫిరాయింపులకు నేను వ్యతిరేకం అని మాట్లాడుతూ దాన్ని మేము స్వాగతిస్తున్నాము అని అన్నారు..అందుకే సుప్రీంకోర్టు నిబంధనలకు అనుగుణంగా స్పీకర్ గారు పార్టీ ఫిరాయించిన ఎమ్మెల్యేల మీద చర్యలు తీసుకోవాలని విజ్ఞప్తి చేశామని తెలిపారు..పార్టీ మారిన ఇద్దరు ఎమ్మెల్యేలకు వారి నియోజకవర్గంలోని డీఎస్పీలు ఫోన్ చేసి మీరు పార్టీ మారండి లేదంటే ప్రాణగండం ఉందని భయపెట్టారు..అందుకే పార్టీ మారారు అని ఆయన పేర్కొన్నారు..