బీజేపీలో బీఆర్ఎస్ విలీనం
బీఆర్ఎస్ పార్టీని బీజేపీలో విలీనం చేయడానికి ఆ పార్టీ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్.. మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఢిల్లీ ప్రదిక్షణలు చేస్తున్నారు అని కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యే బీర్ల ఐలయ్య అన్నారు.
పార్టీ ఫిరాయింపుల గురించి కేటీఆర్ చేసిన వ్యాఖ్యలపై ఐలయ్య స్పందిస్తూ అసలు ఎమ్మెల్యేల ఫిరాయింపులు మొదలెట్టిందే బీఆర్ఎస్… పార్టీ ఫిరాయింపుల గురించి మాట్లాడే అర్హత ఆ పార్టీ నేతలకు లేదని ఆయన అన్నారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ ఎంపీ సురేష్ రెడ్డి బీఆర్ఎస్ ను బీజేపీలో విలీనం చేయడానికే చూస్తున్నారని ఆయన ఆరోపించారు.