CMRF పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

 CMRF పై రేవంత్ సర్కారు కీలక నిర్ణయం

ఆర్థికంగా వెనకబడిన వారికీ ఆసుపత్రి విషయంలో అండగా ఉండే పథకం సీఎంఆర్ఎఫ్.. ఇలాంటి పథకం గురించి ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది.

ఇందులో భాగంగా ఇకపై ఈ పథకం గురించి ఆఫ్ లైన్ లో కాకుండా ఆన్ లైన్లో లబ్దిదారుల నుండి దరఖాస్తులను తీసుకునేవిధంగా చర్యలను చేపట్టింది.దీనికి సంబంధించిన వెబ్ సైట్ ను  సీఎం రేవంత్ రెడ్డి ఈరోజు మంగళవారం ప్రారంభించారు.

ఈనెల 15 తర్వాత నుంచి దరఖాస్తులను ఆన్ లైన్ లో స్వీకరించాలని నిర్ణయించారు. ఇందుకు దరఖాస్తుదారుని వివరాలు, బ్యాంక్ ఖాతా నెంబర్, ఎమ్మెల్యే/ఎమ్మెల్సీ సిఫార్సు లేఖ, మెడికల్ బిల్లులు అవసరమని పేర్కొన్నది..

వెబ్ సైట్ : https://cmrf.telangana.gov.in/

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *