మోతీలాల్ నాయక్ దీక్ష విరమణ
గత తొమ్మిది రోజులుగా అమరణ నిరాహర దీక్ష చేస్తున్న నిరుద్యోగ జేఏసీ నేత మోతీలాల్ నాయక్ దీక్షను విరమించాడు..ఈరోజు గాంధీ ఆసుపత్రిలో మీడియాతో మాట్లాడుతూ “గత 9 రోజులుగా దీక్ష చేస్తున్నా ప్రభుత్వం నుంచి కనీస స్పందన లేదని మండిపడ్డారు.
ఆరోగ్యం దెబ్బతినడంతోనే దీక్ష విరమిస్తున్నానని మీడియాతో చెప్పారు. రేపటి నుంచి ప్రత్యక్షంగా ఆందోళనలు ఉద్ధృతం చేస్తామన్నారు.
గ్రూప్-2 పోస్టులు పెంచాలని, మెగా డీఎస్సీ నిర్వహణతో పాటు జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయాలని మోతీలాల్ దీక్ష చేపట్టిన సంగతి తెల్సిందే..ఇటీవల మాజీ మంత్రి తన్నీరు హారీష్ రావు ఆరోగ్యం కాపాడుకోవాలి..నీకున్న కుటుంబ బాధ్యతల నేపథ్యంలో దీక్ష విరమించు..ప్రభుత్వంపై ఆన్ రోడ్ ఆఫ్ రోడ్ కోట్లాడుదాం ..అసెంబ్లీలో నిలదీస్తామని హామీచ్చిన సంగతి తెల్సిందే.