స్పీకర్ కి జగన్ లేఖ
ఏపీ మాజీ ముఖ్యమంత్రి..వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి అసెంబ్లీ స్పీకర్ అయ్యన్నపాత్రుడుకి లేఖ రాశారు..ఆ లేఖలో మొన్న జరిగిన ఎమ్మెల్యేల ప్రమాణస్వీకార కార్యక్రమంలో మంత్రుల తర్వాత నాతో ప్రమాణ స్వీకారం చేయించడం పద్ధతులకు విరుద్ధంగా ఉంది..
సభలో ప్రతిపక్ష నాయకుడి హోదా ఇవ్వకూడదని ముందుగానే నిర్ణయించుకున్నట్టు ఉన్నారు.. విపక్షంలో ఎవరికి ఎక్కువ సీట్లు ఉంటే వారికే ప్రతిపక్ష హోదా ఇవ్వాలని చట్టంలో ఉంది.. ప్రతిపక్ష హోదా ఇవ్వాలంటే 10శాతం సీట్లు ఉండాలని చట్టంలో ఎక్కడా లేదు..
పార్లమెంట్ లో కాని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ లో కాని ఈ నిబంధనను ఎవరూ పాటించలేదు.. అధికార కూటమి , స్పీకర్ ఇప్పటికే నాపట్ల శత్రుత్వాన్ని ప్రదర్శిస్తున్నారు.. చచ్చేదాకా కొట్టలంటూ స్పీకర్ మాట్లాడిన మాటలు వీడియోల రూపంలో బయటకు వచ్చాయి.. ఇటువంటి పరిస్థితులలో అసెంబ్లీలో గొంతు విప్పే పరిస్థితులు కనిపించట్లేదు.. ప్రతిపక్ష హోదాతోనే ప్రజా సమస్యలను బలగం వినిపించే అవకాశం ఉంటుంది.. ఈ అంశాలను దృష్టిలో ఉంచుకుని ఈ లేఖను పరిశీలించాలని కోరుతున్నానని లేఖలో పేర్కోన్నారు.