రాజకీయ చదరంగంలో చెరగని తప్పులు
తెలంగాణ రాష్ట్ర రాజకీయాల్లో ప్రస్తుతం హాట్ టాఫిక్ బీఆర్ఎస్ పార్టీ నుండి అధికార కాంగ్రెస్ పార్టీలోకి వలసల జోరు. బీఆర్ఎస్ కు చెందిన ఎమ్మెల్సీ పట్నం మహేందర్ రెడ్డి,ఎమ్మెల్యేలు తెల్లం వెంకట్రావు,దానం నాగేందర్,సంజయ్ కుమార్,పోచారం శ్రీనివాస్ రెడ్డి,కడియం శ్రీహారిలతో పాటు రాజ్యసభ సభ్యులు కేకే,ఎంపీ రంజిత్ రెడ్డి లు కాంగ్రెస్ తీర్ధం పుచ్చుకున్న సంగతి తెల్సిందే.. ఎమ్మెల్యేలు దానం నాగేందర్ ,తెల్లం వెంకట్రావులు పార్టీ మారినప్పుడు రానీ వ్యతిరేకత కడియం,పోచారం,కేకే,సంజయ్ మారినప్పుడు ఇటు బీఆర్ఎస్ పార్టీ క్యాడర్ లో అటు రాజకీయ విశ్లేషకుల్లో తీవ్రమైన వ్యతిరేకత రావడం విశేషం..
సహాజంగా పార్టీ మారినప్పుడు ఏ ఎమ్మెల్యే అయిన ఎంపీ అయిన అఖర్కి నాయకుడైన చెప్పే మాట నియోజకవర్గ అభివృద్ధి కోసం మారుతున్నట్లు రోటీన్ డైలాగ్ ఒకటి చెప్తారు.. ఇది ఇప్పుడే కాదు తరతరాలుగా వస్తోన్న సంప్రదాయం.. తెలంగాణ ఏర్పడిన మొదట్లో జరిగిన ఎన్నికల్లో అరవై మూడు స్థానాల్లోనే గెలుపొందిన అప్పటి టీఆర్ఎస్ ఇప్పటి బీఆర్ఎస్ అప్పట్లో టీడీపీ కాంగ్రెస్ పార్టీలకు చెందిన ఎమ్మెల్యేలను రాజకీయ పునరేకీరణలో భాగమంటూ.. అప్పటి సీఎం నారా చంద్రబాబు నాయుడు కొత్తగా ఏర్పడిన తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వాన్ని కూలుస్తారనే వార్తలు వచ్చిన నేపథ్యంలో గులాబీ దళపతి ఫిరాయింపులను ప్రోత్సాహించారు.. ఈ ఫిరాయింపులను సైతం ప్రజలు అంగీకరించారు కాబట్టి తర్వాత జరిగిన ఎన్నికల్లో టీఆర్ఎస్ (బీఆర్ఎస్)ఎనబై ఎనిమిది స్థానాలతో తిరుగులేని మెజార్టీని కట్టబెట్టారు.. ఇటీవల జరిగిన సార్వత్రిక ఎన్నికల్లో బీఆర్ఎస్ ఓటమికి..అధికారం కోల్పోవడానికి గల కారణాలు మనందరికి తెల్సిందే..
అయితే తాజాగా పోచారం శ్రీనివాస్ రెడ్డి,కేకే ,కడియం శ్రీహరి కాంగ్రెస్ పార్టీలో చేరడంపై విశ్లేషకులు ,బీఆర్ఎస్ నేతలు పలు రకాలుగా విశ్లేషణలు చేస్తున్నారు..పోచారం శ్రీనివాస్ రెడ్డిని కేసీఆర్ లక్ష్మీ పుత్రుడు అంటూ కీర్తించడమేకాకుండా తన ప్రభుత్వంలో మంత్రిగా..స్పీకర్ గా అత్యున్నత పదవులివ్వడమే కాకుండా ప్రతి కార్యక్రమంలో తన పక్కనే పెట్టుకుని మరి ఎవరికివ్వని ప్రాధాన్యతను ఇచ్చారు.. ఇక కడియం శ్రీహరిని అయితే ఏకంగా ఎంపీగా ఉన్న అతడ్ని ఎమ్మెల్సీని చేసి డిప్యూటీ సీఎంగా బాధ్యతలు అప్పజెప్పారు..అక్కడితో ఆగకుండా తర్వాత ఎన్నికల్లో ఉద్యమంలో పార్టీకి అండగా ఉన్న తాటికొండ రాజయ్యను కాదని మరి ఎమ్మెల్యే అభ్యర్థిగా అవకాశమివ్వడమే కాకుండా స్టేషన్ ఘన్ పూర్ నుండి గెలిపించుకున్నారు కేసీఆర్ నేతృత్వంలోని బీఆర్ఎస్ శ్రేణులు..అటు తర్వాత కడియం తనయ డా.కడియం కావ్యకు ఎంపీ టికెట్ ఇవ్వడమే కాకుండా భీఫాం కూడా ఇచ్చారు.. కొన్ని రాజకీయ కారణాలతో కడియం శ్రీహారి తన కూతురుతో సహా కాంగ్రెస్ లో చేరారు..
రాజ్యసభ ఎంపీ కేకే విషయానికి వస్తే రెండు సార్లు ఎంపీగా అవకాశం ఇవ్వడమే కాకుండా తన తనయుడు విప్లవ్ కుమార్ కు కార్పోరేషన్ పదవితో పాటు ఎలాంటి రాజకీయానుభవం లేని తన కుమార్తె గద్వాల విజయలక్ష్మీకి గ్రేటర్ హైదరాబాద్ మేయర్ పదవి కట్టబెట్టారు కేసీఆర్.. పార్టీ సంబంధిత ఏ కార్యక్రమం జరిగిన..అధికార కార్యక్రమం జరిగిన కానీ కేకే లేకుండా చేసేవారు కాదు కేసీఆర్ ..పార్టీలో తనతర్వాత అత్యంత ప్రాధాన్యత ఉన్న పదవిలో కూర్చోబెట్టారు.. ఇవన్నీ కాదనుకుని పార్టీ కష్టకాలంలో ఉన్నప్పుడు వదిలేసి కాంగ్రెస్ పార్టీలో చేరారు.. తమ వారసుల రాజకీయ భవిష్యత్తుకై పార్టీ మారారే తప్పా ప్రజల అభిష్టం మేరకు కాదు ..నియోజకవర్గాల అభివృద్ధి..ప్రజాసంక్షేమం గురించి కాదని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నరు.. రాజకీయ చరమాంకంలో ఉన్న ఈ ముగ్గురు కష్టకాలంలో ఉన్న బీఆర్ఎస్ ను వదిలేసి తమ స్వార్ధ రాజకీయాల కోసం పదవుల కోసం అధికారం కోసం వెంపర్లాడుతూ పార్టీని వదిలేసి తమ రాజకీయ చరిత్రలో చెరగని తప్పులు చేశామన్న ముద్ర వేసుకున్నారని ఇటు రాజకీయ విశ్లేషకులు..బీఆర్ఎస్ శ్రేణులు వ్యాఖ్యానిస్తున్నారు..