పాలనలో అనుభవరాహిత్యం-తెలంగాణలో బదిలీల బంతాట

 పాలనలో అనుభవరాహిత్యం-తెలంగాణలో బదిలీల బంతాట

3 total views , 1 views today

తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం  చేస్తున్న ఐఏఎస్,ఐపీఎస్ అధికారుల బదిలీల గురించి విశ్లేషకులు పాలనలో రేవంత్ అనుభవరాహిత్యంతో పాటు అధికారులకు తలనొప్పులు, ప్రజలకు తిప్పలు!
తెలంగాణలో ప్రస్తుత బదిలీలు బంతాటలా ఉందని వ్యాఖ్యానిస్తున్నారు..

ఎప్పుడుంటామో, ఎప్పుడు ఊడుతామో తెలియక పనుల మీద అధికారులు  సీరియస్ దృష్టి పెట్టకపోవడంతో రాష్ట్రంలో  పాలన పడకేసి, రాష్ట్రం అధోగతి పాలయ్యే అవకాశం ఉందని విశ్లేషిస్తున్నారు.. దీనికి కొన్ని ఊదాహరణలు ఊదాహరిస్తున్నారు..

1) ఐపీఎస్‌ అధికారి ఏవీ రంగనాథ్‌ గత ఏడు నెలల్లో అయిదుసార్లు బదిలీ అయ్యారు. నవంబర్‌లో వరంగల్‌ పోలీస్‌ కమిషనర్‌గా ఉన్న ఆయనను పోలింగ్‌ సమయానికి వీఆర్‌లో పెట్టారు. డిసెంబర్‌లో హైదరాబాద్‌ సిటీ క్రైమ్‌ జాయింట్‌ కమిషనర్‌గా బదిలీ చేశారు. మార్చిలో మరోసారి మల్టీజోన్‌-1 ఐజీగా బదిలీ అయ్యారు. తాజాగా ఆయనను హైదరాబాద్‌లో కొత్తగా పెట్టబోయే ఎన్‌ఫోర్స్‌మెంట్‌ విభాగానికి కమిషనర్‌గా నియమిస్తూ ఉత్తర్వులిచ్చారు.

2) డిసెంబర్‌ వరకు ఆరోగ్యశాఖ ముఖ్యకార్యదర్శిగా ఉన్న సీనియర్‌ ఐఏఎస్‌ అధికారి రిజ్వీని రేవంత్‌ సర్కారు వచ్చాక విద్యుత్తుశాఖకు ముఖ్యకార్యదర్శిగా నియమించింది. ఇప్పుడు మళ్లీ ఆయనను విద్యుత్తు నుంచి తప్పించి వాణిజ్య పన్నుల శాఖ ముఖ్యకార్యదర్శిగా నియమించింది.

3) డిసెంబర్‌లో రాష్ట్ర ప్రజాసంబంధాల శాఖ కమిషనర్‌గా, ప్రత్యేక కార్యదర్శిగా ఉన్న కోరెం అశోక్‌రెడ్డిని రాష్ట్ర హార్టికల్చర్‌ డైరెక్టర్‌గా మార్చిలో నియమించారు. ఇప్పుడు హైదరాబాద్‌ మెట్రో వాటర్‌ బోర్డు ఎండీగా బదిలీ చేశారు. అంటే ఆరు నెలల్లో మూడోసారి పోస్టింగ్‌ మార్చారు.

4) కరీంనగర్‌ కలెక్టర్‌గా మళ్లీ పమేలా సత్పతిని పంపించారు. డిసెంబర్‌లో రాష్ట్ర పురపాలక శాఖ డైరెక్టర్‌గా ఉన్న ఆమెను, రేవంత్‌ సర్కారు కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమించింది. ఆ తర్వాత వారం క్రితం బదిలీ చేసింది. మళ్లీ ఏమైందో ఇప్పుడు ఆమెనే తిరిగి కరీంనగర్‌ కలెక్టర్‌గా నియమిస్తూ ఉత్తర్వులు జారీచేశారు.

5) టీఎస్‌ఐఐసీ ఎండీగా ఉన్న ఈవీ నర్సింహారెడ్డిని ట్రైబల్‌ వెల్ఫేర్‌ డైరెక్టర్‌గా రేవంత్‌ సర్కారు బదిలీ చేసి, ఇప్పుడు పాఠశాల విద్యాశాఖ డైరెక్టర్‌గా నియమించింది.

6) మహాత్మా జ్యోతిబాఫూలే బీసీ సంక్షేమ గురుకుల విద్యాసంస్థల సొసైటీ కార్యదర్శిగా కొనసాగుతున్న మల్లయ్యభట్టును గత మార్చిలోనే ప్రభుత్వం బదిలీ చేసింది. గురుకుల పోస్టుల భర్తీ ప్రక్రియ కొనసాగుతున్న తరుణంలోనే హడావుడిగా ట్రాన్స్‌ఫర్‌ చేసింది. సమగ్ర సర్వశిక్షా అభియాన్‌ ప్రాజెక్టు స్టేట్‌ డైరెక్టర్‌, తెలంగాణ ఎడ్యుకేషన్‌, వెల్ఫేర్‌ ఇన్‌ఫ్రాస్ట్రక్చర్‌ డెవలప్‌మెంట్‌ కార్పొరేషన్‌ ఎండీగా నియమించింది. తాజాగా మల్లయ్యభట్టును పేరెంట్‌ డిపార్ట్‌మెంటైన బీసీ వెల్ఫేర్‌ డిపార్ట్‌మెంట్‌కే వెనక్కి పంపించింది.

7) కీలకమైన సీడీఏంఎలను మార్చడంలో రేవంత్ సర్కారు సరికొత్త రికార్డు సృష్టించింది. ఆరు నెలల పాలనలోనే నలుగురు సీడీఏంఎలు వచ్చారు. కాంగ్రెస్‌ ప్రభుత్వం ఏర్పడేనాటికి అర్వింద్‌ కుమార్‌ అదనపు బాధ్యతల్లో కొనసాగుతుండగా గత డిసెంబర్‌ 18న హరిచందనను సీడీఎంఏగా నియమించారు. ఆమె రెండు వారాలు మాత్రమే కొనసాగారు. ఈ ఏడాది జనవరి 2న దివ్య దేవరాజన్‌కు బాధ్యతలు అప్పగించారు. ఆరు నెలలు గడువకుండానే ఆమెను సెర్ప్‌ సీఈవోగా బదిలీచేశారు. ఆమె స్థానంలో ఎవరినీ నియమించలేదు. వీపీ గౌతమ్‌కు అదనపు బాధ్యతలు అప్పగించారు.

8 ) ఐఏఏస్ అధికారిణి హరిచందనను డిసెంబర్ 2023లో సీడీఎంఏగా, జనవరి 2024లో నలగొండ కలెక్టర్‌గా నియమించి, ఇప్పుడు తాజాగా ఆర్&బీ కార్యదర్శిగా పోస్టింగ్ ఇచ్చారు.

9) కీలకమైన రాచకొండ పోలీస్ కమీషనర్‌గా డిసెంబర్2023లో సుధీర్ బాబును నియమించిన సర్కార్ రెండు నెలలు తిరక్కుండానే ఆ పోస్టులో తరుణ్ జోషీని నియమించింది.

Related post

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

What do you like about this page?

0 / 400