నాగార్జునసాగర్ లో అక్రమంగా ఇసుక దందా
తెలంగాణ రాష్ట్రంలో నాగార్జున సాగర్ అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో ఇసుక దందాకు అడ్డే లేకుండా పోయింది..స్థానికపోలీసులకు చెప్పి చెప్పి విసిగిపోయి స్వయంగా అక్రమ ఇసుక ట్రాక్టర్లను 30 మంది రైతులు పట్టుకున్న సంఘటన తాజాగా వెలుగులోకి వచ్చింది..
నాగార్జునసాగర్ నియోజకవర్గంలోని అనుముల మండలంలోని పులిమామిడి, కుమ్మరి కుంట, కేకే కాలువ శివారులోని రైతుల పొలాలలో బోర్లను పైపులైన్ ధ్వంసం చేసి ట్రాక్టర్ల ద్వారా ఇసుక అక్రమంగా రవాణా చేస్తున్నారు..
దీంతో గ్రామంలోని రైతులు గత రెండు నెలలుగా సంబంధిత పోలీస్, మైనింగ్ రెవెన్యూ అధికారుల దృష్టికి తీసుకెళ్లిన ఫలితంలేకుండా పోయింది.
దీంతో వివిధ గ్రామాలకు చెందిన సుమారు 30 మంది రైతులు ఇసుక రవాణా చేస్తున్న ట్రాక్టర్లను పట్టుకుని హాలియా పోలీస్ స్టేషన్ కు తరలించడం జరిగింది.