కాంగ్రెస్ లో చేరిన పోచారం
తెలంగాణ రాష్ట్ర ప్రధాన ప్రతిపక్ష బీఆర్ఎస్ కు చెందిన బాన్సువాడ అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే..మాజీ స్పీకర్ ..మాజీ మంత్రి పోచారం శ్రీనివాస్ రెడ్డి,అతని తనయుడు పోచారం భాస్కర్ రెడ్డి సీఎం రేవంత్ రెడ్డి సమక్షంలో కాంగ్రెస్ పార్టీలో చేరారు..
వీరిద్దరికి సీఎం రేవంత్ రెడ్డి కాంగ్రెస్ కండువా కప్పి పార్టీలోకి సాధారంగా ఆహ్వానించారు.. అంతకుముందు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డితో కల్సి సీఎం రేవంత్ హైదరాబాద్ లోని పోచారం ఇంటికెళ్లిన సంగతి తెల్సిందే.