కేసులన్నీ ఎత్తివేస్తాం
ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర రాజధాని అమరావతి కి చెందిన రైతులపై గత వైసీపీ ప్రభుత్వం బనాయించిన అక్రమ కేసులు ఎత్తివేయాలని హోం మంత్రి అనితకు రాజధాని ప్రాంత మహిళలు విజ్ఞప్తి చేశారు.
గత ప్రభుత్వ నిరంకుశతత్వానికి వ్యతిరేకంగా రాజధాని కోసం చేసిన ఉద్యమంలో తమపై అక్రమ కేసులు బనాయించారని మహిళలు ఈ సందర్భంగా దుయ్యబట్టారు.
రైతులంతా ఐదేండ్లు ఓ నేరస్థుల్లా ప్రతినెలా కోర్టుల చుట్టూ తిరగాల్సి వస్తోందని వారు ఆవేదన వ్యక్తం చేశారు. అక్రమ కేసులన్నింటిపై సమీక్షిస్తామని తెలిపిన హోం మంత్రి అనిత న్యాయం చేస్తామని వారికి హామీనిచ్చారు.