మహోత్తర కార్యక్రమానికి సీఎం రేవంత్ రెడ్డి శ్రీకారం
తెలంగాణలోని 65 ఐటీఐలను ఆధునిక సాంకేతిక పరిజ్ఞానానికి అనుగుణంగా నైపుణ్యాభివృద్ధి కేంద్రాలుగా తీర్చిదిద్దే మహాత్తర కార్యక్రమానికి ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం శ్రీకారం చుట్టింది.
టాటా టెక్నాలజీస్ సహకారంతో ఈ ఐటీఐలను స్కిల్ డెవలప్మెంట్ సెంటర్లుగా మార్చే ప్రాజెక్టునకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి మల్లేపల్లి ఐటీఐ ప్రాంగణంలో భూమి పూజ నిర్వహించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి శ్రీధర్ బాబు, టాటా టెక్నాలజీ సంస్థ ప్రతినిధులు పాల్గొన్నారు.