ఏపీ రాజధానిపై చంద్రబాబు కీలక ప్రకటన
ఏపీ రాజధాని గురించి టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు కీలక ప్రకటన చేశారు.NDA శాసనసభ పక్ష సమావేశం సందర్భంగా టీడీపీ అధినేత నారా చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ రాష్ట్రానికి అమరావతి రాజధానిగా ఉంటుందని అయన స్పష్టం చేశారు.
మరోవైపు ‘విశాఖను ఆర్థిక రాజధాని, ఆధునిక నగరంగా అభివృద్ధి చేసుకుందాము . ఆనాటి సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి విశాఖను రాజధానిగా చేస్తానంటే నువ్వు రావొద్దని ప్రజాతీర్పు ఇచ్చిన నగరం విశాఖ.
కర్నూలును న్యాయరాజధానిగా చేస్తామని చివరికి ఏమీ చేయలేదు. రాయలసీమలో తక్కువ సీట్లు వస్తాయని తొలుత భయపడ్డాను. కానీ అక్కడా కూటమికి మంచి సీట్లు వచ్చాయి’ అని బాబు ఈ సందర్బంగా చెప్పారు