తెలంగాణ రాష్ట్రావతరణ రోజే ఘోర అవమానం
జూన్ 2 తెలంగాణ ప్రజలందరూ తమకు వలస పాలకుల చెర నుండి విమూక్తి కలిగిన రోజు అని భావిస్తారు.ఈ రోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా ప్రపంచ వ్యాప్తంగా ఉన్న తెలంగాణోళ్లందరూ ఈ రోజును ఘనంగా జరుపుకుంటారు.
ఈ క్రమంలో ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం జూన్2 సందర్భంగా రాజధాని మహానగరంలో మెట్రో పిల్లర్లకు ప్రభుత్వం తరపున ప్రకటనలు ఇచ్చింది.ఈ ప్రకటనను తెలియజేస్తూ హోర్డింగ్స్ కటౌట్లు నగరవ్యాప్తంగా వెలిశాయి.
ఈ యాడ్ లో తెలంగాణ మ్యాప్ ను తప్పుగా ముద్రించడంతో తెలంగాణ వాదులు,నెటిజన్లు తెలంగాణ మ్యాప్ రూపురేఖలు తెలియనోళ్లు తెలంగాణ ఆస్థిత్వాన్ని తెలంగాణ ప్రజల హక్కులను ఏమి కాపాడతారంటూ విమర్శల పర్వం కురిపిస్తున్నారు.
తప్పుగా ముద్రించిన తెలంగాణ మ్యాప్