వైసీపీ సర్కారుకు షాక్
ఇటీవల ముగిసిన సార్వత్రిక ఎన్నికల్లో గెలుపుపై ధీమాతో ఉన్న ప్రస్తుత అధికార వైసీపీ ప్రభుత్వానికి ఏపీలోని ఆసుపత్రుల యాజమాన్యం షాకిచ్చింది.
గత రెండేండ్లుగా పెండింగ్ లో ఉన్న ఆరోగ్యశ్రీ నిధులను విడుదల చేయాలని వైసీపీ సర్కారుకు ప్రైవేట్ ఆసుపత్రుల యాజమాన్యం ఆల్టీమేటం జారీచేసింది.
దీంతో కేవలం రెండోందల మూడు కోట్ల రూపాయలను మాత్రమే వైసీపీ సర్కారు విడుదల చేసింది.. మొత్తం పెండింగ్ నిధులను విడుదల చేయకపోవడంతో ఈ రోజు నుండి రాష్ట్ర వ్యాప్తంగా ప్రైవేట్ ఆసుపత్రులల్లో ఆరోగ్యశ్రీ సేవలను నిలిపివేస్తున్నట్లు ప్రకటించాయి.