లోక్ సభ ఎన్నికల్లో బీజేపీ 272స్థానాలు గెలవకపోతే..? ప్లాన్ బీ ఏంటీ..?
దేశ వ్యాప్తంగా ఉన్న మొత్తం 543లోక్ సభ స్థానాలకు ఎన్నికలు జరుగుతున్న సంగతి తెల్సిందే.. ఈ లోక్ సభ ఎన్నికల్లో 272 స్థానాలను గెలుపొందిన పార్టీ కేంద్రంలో అధికారాన్ని చేపడుతుంది. అయితే ముచ్చటగా మూడోసారి కేంద్రంలో మేమే అధికారంలోకి వస్తాము..
మాకు తప్పకుండా 400సీట్లు వస్తాయని బీజేపీకి చెందిన సామాన్య కార్యకర్త నుండి ప్రధానమంత్రి నరేందర్ మోదీ వరకు అందరూ గట్టిగా ప్రచారం చేసుకుంటున్నారు.. తాజాగా ఓ ప్రముఖ మీడియా ఛానెల్ కిచ్చిన ఇంటర్వూలో కేంద్ర మంత్రి అమిత్ షాను ఒకవేళ బీజేపీ 272స్థానాల్లో గెలవకపోతే ప్లాన్ బీ ఏంటని ప్రశ్న అడిగారు .
దీనికి సమాధానంగా అమిత్ షా మాట్లాడుతూ కేంద్రంలో ముచ్చటగా మూడోసారి తామే అధికారంలోకి వస్తాము. దేశ వ్యాప్తంగా అరవై కోట్ల మంది సైన్యం ప్రధానమంత్రి నరేందర్ మోదీకి అండగా ఉన్నారు.. ఎందుకు మోదీని గెలిపించుకోవాలి.? .బీజేపీకి ఎందుకు ఓటు వేయాలి అని ప్రతి భారతీయుడు క్లారిటీగా ఉన్నారు. ప్లాన్ ఏ విజయవంతమవుతున్నప్పుడు ప్లాన్ బీ తో అవసరం ఏముందని వారు సమాధానం ఇచ్చారు.