సన్ రైజర్స్ ఘన విజయం
హైదరాబాద్ : ఉప్పల్ వేదికగా ముంబై ఇండియన్స్ తో జరిగిన ఐపీఎల్ ట్వంటీ ట్వంటీ మ్యాచ్ లో సన్ రైజర్స్ ఘన విజయం సాధించింది..
టాస్ ఓడి ముందు బ్యాటింగ్ కు దిగిన సన్ రైజర్స్ మొత్తం ఇరవై ఓవర్లలో 277పరుగులు చేసింది. అనంతరం లక్ష్యచేధనలో బ్యాటింగ్ కు దిగిన ముంబై ఇండియన్స్ పూర్తి ఓవర్లను ఆడింది.
ఐదు వికెట్లను కోల్పోయి కేవలం 246పరుగులు మాత్రమే చేసి 31పరుగుల తేడాతో ఓటమిపాలైంది.