ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర..!

Nominated posts
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : ఏపీలో నామినేటెడ్ పదవుల జాతర కొనసాగుతోంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు నేతృత్వంలోని కూటమి ప్రభుత్వం రాష్ట్రంలో ముప్పై ఒకటి నామినేటెడ్ పదవులను భర్తీ చేస్తూ అధికారిక జీవోను విడుదల చేసింది. ఇందులో ప్రధానమైన వాటిలో ఒకటి కమ్మ కార్పొరేషన్ చైర్మన్ పదవిని నాదెండ్ల బ్రహ్మం కు ఇచ్చారు.
మరోవైపు ఎస్సీ కార్పొరేషన్ చైర్మన్ గా ఆకేపోగు ప్రభాకర్, బ్రాహ్మణ కార్పొరేషన్ చైర్మన్ గా బుచ్చి రామ్ ప్రసాద్, హిందూ ధర్మ పరిరక్షణ ట్రస్ట్ చైర్మన్ గా దాసరి శ్రీనివాసులు, విశ్వబ్రాహ్మణ కార్పోరేషన్ చైర్మన్ గా కమ్మరి పార్వతి, దూదేకుల కార్పొరేషన్ చైర్మన్ గా నాగుల్ మీరా కాసునూరి, వైశ్య కార్పొరేషన్ చైర్మన్ గా రమేష్ మొదలవలస, జంగం కార్పొరేషన్ చైర్మన్ గా వి చంద్రశేఖర్, వడ్డెర కార్పొరేషన్ చైర్మన్ గా గుంటసల వెంకటలక్ష్మీ, ఓయూడీఏ ఛైర్మన్ గా షేక్ రియాజ్ ను నియమిస్తూ కూటమి ప్రభుత్వం జీవో జారీ చేసింది.