తెలంగాణ ప్రభుత్వం చారిత్రాత్మక నిర్ణయం

TPCC chief
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్: తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం చారిత్రాత్మకంగా 42 శాతం బీసీ రిజర్వేషన్లతో స్థానిక సంస్థల ఎన్నికల వైపు అడుగుపెట్టడం ఒక విప్లవాత్మక నిర్ణయం అని తెలంగాణ ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీ అధ్యక్షుడు , ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ అన్నారు.ఈ రోజు జరిగిన క్యాబినెట్ సమావేశంలో బీసీ రిజర్వేషన్ల అమలుకు అవసరమైన ఆర్డినెన్స్ తీసుకురావాలని ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాన్ని ఆయన స్వాగతించారు.
2018 చట్టాన్ని సవరించి బీసీలకు న్యాయం చేసే దిశగా ప్రభుత్వం చేసిన ప్రకటనను ఆయన “సామాజిక విప్లవానికి నాంది”గా అభివర్ణించారు.ఏఐసీసీ అగ్రనేత శ్రీ రాహుల్ గాంధీ గారు భారత్ జోడో యాత్రలో చేసిన “జనాభా ప్రాతిపదికన రిజర్వేషన్లు పెంచాలి” అన్న డిమాండ్‌ను దేశంలో తొలిసారిగా తెలంగాణ రాష్ట్రంలోనే అమలు చేస్తున్నందుకు గర్వంగా ఉందన్నారు
ఈ చారిత్రాత్మక నిర్ణయాన్ని అమలు పరచేందుకు కృషి చేసిన ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, ఉప ముఖ్యమంత్రి శ్రీ భట్టి విక్రమార్క గారు, అలాగే మంత్రివర్గ వర్గ సభ్యులందరికీ పేరు పేరునా ధన్యవాదాలు తెలియజేశారు.”తెలంగాణ సమాజం, ముఖ్యంగా బీసీ సామాజిక వర్గం, సామజిక న్యాయం కోసం పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అండగా నిలవాలని” ఆయన పిలుపునిచ్చారు