ఈనెల 25న మళ్లీ తెలంగాణ క్యాబినెట్ భేటీ..!

Telangana cabinet meeting
సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : గురువారం డా. బీఆర్ అంబేద్కర్ తెలంగాణ రాష్ట్ర నూతన సచివాలయంలో దాదాపు ఆరు గంటల పాటు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధ్యక్షతన క్యాబినెట్ సుధీర్ఘ భేటీ జరిగింది. ఈ భేటీలో పలు కీలక నిర్ణయాలను తీసుకుంది. క్యాబినెట్ భేటీ అనంతరం మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి క్యాబినెట్ నిర్ణయాలను మీడియాకు వెల్లడించారు.
మంత్రి పొంగులేటి మీడియాతో మాట్లాడుతూ’ కాంగ్రెస్ ప్రభుత్వం ఏర్పడిన నాటి నుంచి నేటి వరకూ దాదాపు పంతొమ్మిది సార్లు క్యాబినెట్ భేటీ అయింది. మూడోందల ఇరవై ఏడు అంశాల గురించి చర్చించాం. ఇందులో ఇప్పటివరకు మూడోందల పదిహేను అంశాలను ఆయా శాఖల ద్వారా అమలు చేశాం.
నెలకు రెండు సార్లు క్యాబినెట్ భేటీ జరపాలని నిర్ణయించాం. అందులో భాగంగానే ఈనెల ఇరవై ఐదో తారీఖున మళ్లీ క్యాబినెట్ భేటీ అవుతాం. అమిటీ , సెంటినరీ రీహబిటేషన్ విద్యాసంస్థలను వర్సిటీలుగా మార్చాలని క్యాబినెట్ లో’ నిర్ణయించామని ఆయన పేర్కొన్నారు.