వైసీపీ ఓటమికి ప్రధాన కారణం అదే : మాజీ మంత్రి జోగి రమేష్

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : “ఆంధ్రప్రదేశ్ లో ఏడాది కిందట జరిగిన అసెంబ్లీ ఎన్నికల్లో వైసీపీ ఓడిపోవడానికి అతి ముఖ్యమైన కారణం అమరావతి. అమరావతిని మూడు ముక్కలు చేయకుండా దాన్ని అభివృద్ధి చేయాల్సి ఉండే.
మా ప్రాంతం వారికి రాజధాని ఇక్కడే ఉండాలని ఉంది. ఈ విషయాన్ని అప్పటి ముఖ్యమంత్రి, వైసీపీ అధినేత వైఎస్ జగన్మోహాన్ రెడ్డి దృష్టికి కూడా తీసుకెళ్లాము” అని సంచలన వ్యాఖ్యలు చేశారు మాజీ మంత్రి జోగి రమేష్.
ఆయన ఇంకా మాట్లాడుతూ ” చివరికి మా నాయకుడు ఏ నిర్ణయం తీసుకున్న దానికి కట్టుబడి ఉన్నాము. ఉంటాము. అన్ని ప్రాంతాలు అభివృద్ధి చెందాలనే జగన్ మూడు రాజధానుల నిర్ణయం తీసుకున్నారు. మళ్లీ జగన్ ముఖ్యమంత్రి అయ్యాక అమరావతి రాజధాని నిర్మాణం చేస్తారు. చంద్రబాబు కూడా మేం చెప్పినట్టే వైజాగ్ ఆర్థిక రాజధాని అంటున్నారు” అని వ్యాఖ్యానించారు.