ఆపరేషన్ సిందూర్ దాడిలో సంచలనాత్మక ట్విస్ట్..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : పహల్గాం లో పర్యాటకులపై పాక్ ఉగ్రవాదుల దాడికి నిరసనగా పాకిస్థాన్ లోని ఉగ్రవాదుల స్థావరాలపై, పాక్ ఆక్రమిత కశ్మీర్ లోని ఉగ్ర స్థావరాలపై భారత్ ఆపరేషన్ సిందూర్ పేరుతో దాడి నిర్వహించిన సంగతి తెల్సిందే.
ఈ దాడిలో దాదాపు వందకు పైగా ఉగ్రవాదులు హతమయ్యారు. పాక్ ఉగ్రవాదుల స్థావరాలన్నీ ధ్వంసమయ్యాయి. మే నెల ఏడో తారీఖున పీఓకే, పాక్ లోని జైషే మహ్మద్ , లష్కరే తొయిబా ఉగ్ర స్థావరాలను ఇండియన్ ఆర్మీ ధ్వంసం చేసింది.
ఆపరేషన్ సమయంలో ఆర్మీ చీఫ్ జనరల్ ఉపేంద్ర ద్వివేదీ, నేవీ చీఫ్ అడ్మిరల్ త్రిపాఠి , ఎయిర్ ఫోర్స్ చీఫ్ మార్షల్ ఏపీ సింగ్ వార్ రూమ్ నుంచి ఎప్పటికప్పుడు పరిస్థితులను పర్యవేక్షించారు. అయితే అప్పటి ఫోటోలను ఆర్మీ విడుదల చేశారు.