కేసీఆర్ కు నోటీసులు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : తెలంగాణ తొలి ముఖ్యమంత్రి, బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ కు కాళేశ్వరం విచారణ కమీషన్ నోటీసులు జారీ చేసింది.
కాళేశ్వరం ప్రాజెక్టు నిర్మాణంలో జరిగిన అవకతవకలపై జస్టీస్ పీసీ ఘోష్ ఆధ్వర్యంలో కమిటీ వేసింది రాష్ట్ర ప్రభుత్వం. ఇప్పటివరకూ అధికారులను, ప్రాజెక్టు నిర్మాణంలో పాత్ర ఉన్న అందర్నీ విచారించింది.
తాజాగా అప్పటి ముఖ్యమంత్రిగా ఉన్న కేసీఆర్, నీటి పారుదల శాఖ మంత్రిగా ఉన్న తన్నీరు హరీశ్ రావు, అప్పటి ఆర్థిక శాఖ మంత్రిగా ఉన్న ఈటల రాజేందర్ కు నోటీసులు జారీ చేసింది. వచ్చే నెల జూన్ ఐదో తారీఖులోపు విచారణకు హజరు కావాలని ఆనోటీసుల్లో పేర్కొంది.