మాజీ ఎంపీ మధుయాష్కీ సంచలన వ్యాఖ్యలు..!

సింగిడిన్యూస్, వెబ్ డెస్క్ : కాంగ్రెస్ పార్టీ సీనియర్ నాయకులు, మాజీ ఎంపీ, టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మన్ అయిన మధుయాష్కీ గౌడ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. హైదరాబాద్ నగరంలోని సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలో త్వరలో ప్రారంభం కానున్న ఫ్లై ఓవర్ పనులను పరిశీలించారు.
అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ పదేండ్ల బీఆర్ఎస్ పాలనలో నిధులన్నీ కాళేశ్వరం ప్రాజెక్టుకే తరలించారు. ప్రజాసంక్షేమాన్ని గాలికి వదిలేశారు. అభివృద్ధిని అటకెక్కించారు’ అని సంచలన వ్యాఖ్యలు చేశారు.
ఆయన ఇంకా మాట్లాడుతూ’ వారం పదిరోజుల్లో సాగర్ రింగ్ రోడ్ చౌరస్తాలోని ఫ్లై ఓవర్ ప్రారంభమవుతుంది. దీనివలన ఎల్బీనగర్ నుండి చంపాపేట, కర్మన్ ఘాట్,సంతోష్ నగర్ వైపు వాహానాలు వెళ్లేందుకు సులభతరం కానున్నదని’ అన్నారు.