లక్కీ ఛాన్స్ కొట్టేసిన కాజల్ అగర్వాల్.!

Kajal Aggarwal Indian actress
సింగిడి న్యూస్, వెబ్ డెస్క్: తెలుగు సినిమా ఇండస్ట్రీకి చెందిన సీనియర్ మోస్ట్ హాటెస్ట్ బ్యూటీ.. ఒకప్పటి స్టార్ హీరోయిన్.. పెళ్లి తర్వాత కమ్ బ్యాక్ మూవీస్ తో సూపర్ డూపర్ హిట్స్ కొడుతున్న కాజల్ అగర్వాల్ కు క్రేజీ ప్రాజెక్టులో అవకాశం దక్కినట్లు బాలీవుడ్ వర్గాల్లో టాక్ విన్పిస్తోంది.
బాలీవుడ్ స్టార్ హీరో రణ్ బీర్ కపూర్ హీరోగా, నేచూరల్ స్టార్ హీరోయిన్ సాయి పల్లవి హీరోయిన్ గా సీతారాములుగా నటిస్తోన్న మూవీ ‘రామయాణ’. ఈ చిత్రంలో రావణ క్యారెక్టర్ లో కేజీఎఫ్ ఫేమ్ యశ్ నటిస్తున్నాడు.
యశ్ సరసన రావణ సతీమణి పాత్ర మండోదరి క్యారెక్టర్ గా కాజల్ అగర్వాల్ ఎంపికైనట్లు తెలుస్తోంది. అయితే దీనిపై అధికారక ప్రకటన రావాల్సి ఉంది. రెండు పార్టులుగా తెరకెక్కుతున్న ఈ మూవీ ఫస్ట్ పార్టు వచ్చే ఏడాది నవంబర్ నెలలో విడుదల కానున్నది.