నిరుద్యోగ యువతకు శుభవార్త..!

Good news for unemployed youth..!
తెలంగాణ రాష్ట్రంలోని నిరుద్యోగ యువతకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ సర్కారు శుభవార్తను తెలిపింది. నిన్న సోమవారం అంబేద్కర్ జయంతి సందర్భంగా బాగ్ లింగంపల్లి లో ఆర్టీసీ కళా భవన్ లో జరిగిన కార్యక్రమానికి ముఖ్య అతిథిగా ఆర్టీసీ ఎండీ సజ్జనార్ పాల్గోన్నారు.
ఈ సందర్భంగా సజ్జనార్ మాట్లాడుతూ ఆర్టీసీలో ఖాళీగా ఉన్న 3,038 ఉద్యోగాలను భర్తీ చేయనున్నట్లు తెలిపారు. దీనికి సంబంధించిన నోటిఫికేషన్ త్వరలోనే విడుదల చేస్తాము.
సంస్థలో ఉద్యోగులు.. కార్మిక సిబ్బందిపై పడుతున్న ఒత్తిడిని ఈ ఉద్యోగాల భర్తీ ద్వారా కొంచెం తగ్గించవచ్చు ఆయన తెలిపారు. అయితే వీటి భర్తీకి ఇప్పటికే ప్రభుత్వం గ్రీన్ సిగ్నల్ కూడా ఇచ్చిందని కూడా అన్నారు.
