మాజీ మంత్రి విడదల రజనీకి షాకిచ్చిన రైతులు…!

ఆంధ్రప్రదేశ్ మాజీ మంత్రి.. వైసీపీ మహిళా నాయకురాలు విడదల రజనీకి చిలకలూరుపేట అసెంబ్లీ నియోజకవర్గ పరిధిలో పసుమర్రు రైతులు షాకిచ్చారు. గతంలో అధికారంలో ఉన్న సమయంలో మాజీ మంత్రి విడదల రజనీ మా దగ్గర భూములను లాక్కుకున్నారు.
దాదాపు రెండోందల ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. కొన్నింటికి డబ్బులు ఇచ్చారు. ఇంకా మాకు నలబై లక్షల వరకూ రావాలి.
గతంలో పసుమర్రు రోడ్డును ఆక్రమించుకున్న మాజీ మంత్రి రజనీ కూటమి ప్రభుత్వం అధికారంలోకి రాగానే పంచాయితీకి రాసిచ్చారు. ఈ విషయాన్ని ఆమె మామ తెలిపారు. అయితే దీనిపై హైకోర్టుకెళ్లి స్టే తెచ్చుకున్నారు రజనీ కుమారుడు అని రైతులు చిలకలూరుపేట పబ్లిక్ గ్రీవెన్స్ లో పిర్యాదు చేశారు.
