రేషన్ లబ్ధిదారులకు బిగ్ షాక్..!

Big shock for ration beneficiaries..!
తెలంగాణ వ్యాప్తంగా రేషన్ లబ్ధిదారులకు ముఖ్యమంత్రి అనుముల రేవంత్ రెడ్డి నేతృత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఇటీవల ఉగాది పండుగ రోజు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ప్రారంభించిన సంగతి తెల్సిందే.
దీంతో రాష్ట్ర వ్యాప్తంగా ఆయా నియోజకవర్గాల్లో అక్కడి ఎమ్మెల్యేలు.. ఇంచార్జ్ మంత్రులు ఈ కార్యక్రమాన్ని ఎంతో హాట్టహాసంగా ప్రారంభిస్తున్నారు. అయితే రాష్ట్రంలో అన్ని చోట్ల రేషన్ కార్డు లబ్ధిదారులకు ఇవ్వాల్సిన సన్నబియ్యం స్టాక్ అయిపోయిందంటూ రేషన్ డీలర్లు నోస్టాక్ బోర్డులు పెట్టేస్తున్నారు. కొన్ని చోట్ల సన్నబియ్యం లేవని చెప్పలేక రేషన్ షాపులనే సమయానికి తెరవడంలేదు.
దీంతో లబ్ధిదారులు ప్రభుత్వంపై తీవ్ర అసహానాన్ని వ్యక్తం చేస్తున్నారు. చేతకానప్పుడు సన్నబియ్యం పంపిణీ కార్యక్రమాన్ని ఎవరూ తీసుకు రమ్మన్నారు. మేము అడిగినమా.. మమ్మల్ని ఎందుకు ఇలా ఇబ్బందులు పెడుతున్నారు అంటూ ప్రభుత్వంపై విమర్శలు గుప్పిస్తున్నారు. మార్పు అంటే ఇలా ఉంటుందని అనుకోలేదని వారు వాపోతున్నారు.
