మంత్రివర్గ విస్తరణపై మహేష్ కుమార్ సంచలన వ్యాఖ్యలు..!

TPCC chief
తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణ ఈ ఉగాది పండుగ తర్వాత ఉంటుంది. తాజాగా జరగబోయే క్యాబినెట్ విస్తరణలో పెద్దపల్లి ఎమ్మెల్యే గడ్డం వివేక్ వెంకట స్వామి. మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి..వాకటి శ్రీహారి ముదిరాజు లకు అవకాశం ఉంటుందని కూడా వార్తలు వచ్చాయి.
తాజాగా పీసీసీ చీఫ్.. ఎమ్మెల్సీ మహేష్ కుమార్ గౌడ్ మంత్రివర్గ విస్తరణపై సంచలన వ్యాఖ్యలు చేశారు. మీడియాతో మాట్లాడుతూ మంత్రివర్గ కూర్పులో కొన్ని ఇబ్బందులు.. సమస్యలు తలెత్తుతున్నాయి. అవన్నీ పరిష్కరించినాక మంత్రివర్గ విస్తరణ ఉంటుంది.
దీనిపై త్వరలోనే ఏఐసీసీ నిర్ణయం తీసుకుంటుంది. మంత్రివర్గ విస్తరణలో ప్రాంతాలు.. కులాలు.. అన్నింటీని పరిగణలోకి తీసుకుని చేయాల్సి ఉంటుంది. అయితే ఈసారి మంత్రివర్గ విస్తరణలో మైనార్టీలకు చోటు ఉంటుంది. బీసీల నుండి ఇద్దరు గౌడలకు అవకాశం ఇవ్వాలని కోరినట్లు తెలిపారు.