హైదరాబాద్ ప్రజలకు కేటీఆర్ పిలుపు..!

KTR’s call to the people of Hyderabad..!
తెలంగాణ భవన్ లో జరిగిన మీడియా సమావేశంలో మాజీ మంత్రి.. బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ మాట్లాడుతూ హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీ భూముల వ్యవహారంలో రాష్ట్ర ప్రభుత్వం తప్పనిసరిగా వెనక్కి తగాల్సిందే అని అల్టీమేటం జారీ చేశారు.
ఒకవేళ ప్రభుత్వం వెనక్కి తగ్గకుండా ప్రస్తుతం ఉన్న తీరునే కొనసాగిస్తే హైదరాబాద్ ప్రజలతో కల్సి హెచ్ సీయూ మార్చ్ నిర్వహిస్తామని హెచ్చరించారు. తమ యూనివర్సిటీకి చెందిన భూములను కాపాడుకోవడం కోసం ఎన్నో ఉద్యమాలు.. ధర్నాలు చేస్తున్న యూనివర్సిటీ విద్యార్థులకు అన్ని రకాలుగా అండగా ఉంటామని భరోసానిచ్చారు.
ప్రభుత్వం విద్యార్థులపై పెట్టిన అక్రమ కేసులను తొలగించేలా పోరాటం చేస్తాము. ఎవరూ భయపడాల్సిన పని లేదు. మూడేండ్ల తర్వాత మళ్లీ బీఆర్ఎస్ ప్రభుత్వమే వస్తుంది. అప్పుడు ఆ నాలుగు వందల ఎకరాల భూమిని వెనక్కి తీసుకుంటాము. ఎకో పార్కును అభివృద్ధి చేస్తామని తెలిపారు.