ఆ ఇద్దరి మంత్రులకు చెక్ పెట్టిన జానారెడ్డి లేఖ..!

తెలంగాణ రాష్ట్ర మంత్రివర్గ విస్తరణలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలకు అవకాశం కల్పించాలని కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షులు మల్లిఖార్జున ఖర్గే, ఆ పార్టీ జాతీయ కార్యదర్శి.. సీనియర్ నాయకులు కేసీ వేణు గోపాల్ కు మాజీ మంత్రి.. తెలంగాణ రాష్ట్ర కాంగ్రెస్ సీనియర్ నేత కుందూరు జానారెడ్డి లేఖ రాసిన సంగతి తెల్సిందే.
ఈ నెలలో జరగనున్న మంత్రివర్గ విస్తరణలో ఇప్పటికే మునుగోడు అసెంబ్లీ నియోజకవర్గ ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి, పెద్దపల్లి శాసనసభ్యులు గడ్డం వివేక్ వెంకటస్వామి,మక్తల్ ఎమ్మెల్యే వాకాటి శ్రీహారి ముదిరాజు, బోధన్ ఎమ్మెల్యే పి సుదర్శన్ రెడ్డి పేర్లు ఖరారైనట్లు మీడియాలో వార్తలు చక్కర్లు కొట్టాయి. అయితే తాజాగా జానారెడ్డి లేఖలో రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన నేతలకు అవకాశం ఇవ్వాలని కోరారు.
దీంతో ఇప్పటికే ఉమ్మడి నల్గోండ జిల్లాలో మంత్రులుగా ఉన్న ఉత్తమ్ కుమార్ రెడ్డి, కోమటిరెడ్డి వెంకటరెడ్డి ల ఇండ్లకే మళ్లీ మంత్రివర్గంలో అవకాశం ఇవ్వకూడదు. రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాలకు చెందిన ఎమ్మెల్యేలు మల్ రెడ్డి రంగారెడ్డి, గడ్డం ప్రసాద్ కుమార్, రామోహన్ రెడ్డి,మనోహార్ రెడ్డిలలో ఎవరికోకరికి అవకాశం కల్పించాలని జానారెడ్డి కోరారు.
ఉమ్మడి నల్గోండ జిల్లాలో ఇప్పటికే ఆధిపత్యం చెలాయిస్తున్న మంత్రులు కోమటిరెడ్డి, ఉత్తమ్ లకు చెక్ పెట్టేవిధంగా ఈ రంగారెడ్డి, హైదరాబాద్ జిల్లాల అంశాన్ని తెరపైకి తెచ్చారు. ఇప్పటికే మాకంటే మాకు మంత్రి పదవులు ఇవ్వాలని ఉత్తమ్, కోమటీరెడ్డిలు పట్టుపట్టడంతో జానారెడ్డి లేఖతో దానికి ముగింపు పలకడం ఖాయం. వారిద్దరికి చెక్కు పెట్టేలా జానారెడ్డిని ఆ పార్టీ నాయకత్వం తెరపైకి తీసుకోచ్చిందని గాంధీ భవన్ వర్గాల టాక్.