రేషన్ కార్డు ఉన్నవారికి శుభవార్త..!
 
			                Good news for those with ration cards..!
 
తెలంగాణ రాష్ట్రంలో రేషన్ కార్డు కలిగిన ప్రతి కుటుంబానికీ వచ్చే ఏఫ్రిల్ మాసం నుండి ఆరు కిలోల సన్నబియ్యం అందిస్తామని మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి వెల్లడించారు.
రాష్ట్రంలోని 84% మందికి ఈ బియ్యం సరఫరా చేస్తామని ఆయన తెలిపారు. ఈ నెల 30న హుజూర్ నగర్ నియోజకవర్గంలో సీఎం రేవంత్ రెడ్డి ఈ కార్యక్రమాన్ని ప్రారంభిస్తారని చెప్పారు.
దొడ్డు బియ్యం ఇవ్వడం వల్ల పేదలు తినకుండా అమ్ముకుంటున్నారని పేర్కొన్నారు.ప్రాజెక్టుల కింద వరి సాగుకు నీరు అందించేందుకు వారానికోసారి సమీక్ష చేస్తున్నామని మంత్రి ఉత్తమ్ తెలిపారు.
 
                             
                                     
                                    