ఒకే ఊరిలో ఎండిన 150ఎకరాల పంట- రేవంత్ ఘనత..!

Attack on BRS activist
తెలంగాణ రాష్ట్రంలోని పెద్ద పల్లి జిల్లా ధర్మారం మండలం కొత్తపల్లి గ్రామ పరిధిలో అత్యధికంగా గిరిజన రైతులు సుమారు 300 ఎకరాల్లో వరి సాగు చేశారు. వరి నాట్లు వేసిన సమయంలో బావుల్లో భూగర్భజలాలు మెరుగ్గా ఉండగా, తీరా పంటలు చేతికొచ్చే దశలో భూగర్భజలాలు అడుగంటిపోయాయి.
దీంతో రైతులు వేల రూపాయలు పెట్టి క్రేన్ల ద్వారా పూడిక తీయిం చారు. అయినా ఊటలు రాలేదు. మరికొం దరు రూ.లక్షలు వెచ్చించి పొక్లెయినర్లతో పూడిక తీస్తున్నారు. ఎంత లోతు తవ్వినా బావుల్లో చుక్కనీరు కనబడటం లేదని రైతులు ఆవేదన వ్యక్తంచేస్తున్నారు.
దీంతో సగానికి 150ఎకరాల్లో సాగు చేసిన పంటలు ఎండుతున్నాయి. కండ్లముందే పంటలు ఎండిపోవడంతో వాటిలో గొర్రెలు, పశువులను మేపుతున్నారు. ప్రభుత్వం ఎండిన పంటలకు పరి హారం ఇచ్చి ఆదుకోవాలని వేడుకుంటు న్నారు. తమ గ్రామానికి సాగునీటిని అందిం చేందుకు నిర్మించతలపెట్టిన ఎస్సారెస్పీ ఉప కాల్వ నిర్మాణం మధ్యలోనే ఆగిపోయిందని, దాని నిర్మాణానికి ప్రభుత్వం నిధులు మంజూరు చేయించి పనులు చేపట్టాలని వారు కోరుతున్నారు.