రైతులకు రూ.20, 616 కోట్ల రుణ మాఫీ

తెలంగాణలో ఇరవై రెండు లక్షల రైతులకు సంబంధించిన మొత్తం రూ.20, 616 కోట్లు రుణ మాఫీ చేసినట్లు ఉప ముఖ్యమంత్రి.. ఆర్థిక శాఖ మంత్రి భట్టీ విక్రమార్క మల్లు తెలిపారు. 2025-26 తెలంగాణ రాష్ట్ర వార్షిక బడ్జెట్ ను నిన్న బుధవారం అసెంబ్లీలో ఉప ముఖ్యమంత్రి ప్రవేశపెట్టారు. ఈ సందర్భంగా భట్టీ ప్రసంగిస్తూ.. రైతు భరోసా కింద ఎకరాకు రూ.12000 ఇవ్వనున్నాము..
రైతు భరోసాకు రూ.18000 కోట్ల బడ్జెట్ ను ప్రవేశపెడుతున్నట్లు తెలిపారు.. రైతులు పండించిన వరి సన్న వడ్లకు క్వింటాల్‌కు రూ.500 బోనస్ ఇస్తున్నాము.. 40 లక్షల ఎకరాల్లో సన్న వడ్లసాగు విస్తరణ జరిగింది.. ధాన్యం కొనుగోలు కేంద్రాల సంఖ్య 8,332కు పెంచాము.. ఆయిల్ ఫామ్ సాగుకు టన్నుకు రూ.2000 అదనపు సబ్సిడీ ఇస్తున్నాము..
వడ్ల బోనస్ కింద రైతులకు రూ.1,206 కోట్లు చెల్లింపులు జరిగాయి.. తెలంగాణలో నిరుద్యోగ రేటు 22.9 శాతం నుంచి 18.1 శాతానికి తగ్గింది.. కేవలం ఆరు నెలల్లోనే 57,946 ప్రభుత్వ ఉద్యోగాల భర్తీ చేశాము.. తెలంగాణ డిజిటల్ ఉపాధి కేంద్రం పునరుద్ధరణకు చర్యలు తీసుకుంటున్నాము.. రాజీవ్ యువ వికాస పథకానికి రూ.6000 కోట్లు కేటాయించాము.. బీఎఫ్ఎస్ఐ రంగంలో విద్యార్థులకు ప్రత్యేక కోర్సులు ప్రవేశపెట్టనున్నట్లు భట్టి విక్రమార్క తెలిపారు.