సీఎం రేవంత్ కు దళితులంటే అంత చులకనా..?

Work like a human being, not like a real estate broker..!
తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి ఎస్సీ వర్గీకరణ బిల్లు అసెంబ్లీలో ఆమోదం పొందిన తర్వాత మీడియాతో మాట్లాడుతూ ” నేను జెడ్పీటీసీగా పోటి చేసిన.. ఎమ్మెల్సీగా పోటీ చేసిన.. ఎమ్మెల్యేగా పోటీ చేసిన .. అఖరికీ ఎంపీగా పోటీ చేసిన ప్రతీ ఎన్నికల సమయంలో మాదిగోళ్ళ పిల్లలు నాకోసం పని చేశారు.. నావెంట తిరిగారు.
నాకోసం తిరిగారు అని వారిపై తనకున్న చనువుతో నూ … ప్రేమతోనూ అలా మాట్లాడారు. దీనిపై బీఆర్ఎస్ నెటిజన్లు సోషల్ మీడియాలో తమదైన శైలీలో ఎంత తేడా??!!!.”వాళ్లు నా వెంట తిరిగేవారు” .నేను వాళ్ల వెంట తిరిగేవాడిని” .అందరం కలిసి తిరిగేవాళ్లం” అనే ఆర్ధం వచ్చే విధంగా సెటైర్లు వేస్తూ స్పందించారు. ఈ సంఘటన మరిచిపోక ముందే మరో సంఘటన వెలుగులోకి వచ్చింది.
అదే ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి నకిరేకల్ అసెంబ్లీ నియోజకవర్గం కాంగ్రెస్ పార్టీకి చెందిన దళిత ఎమ్మెల్యే వేముల వీరేశం స్వీట్ తిన్పించడానికి తీసుకోచ్చారు. ఎమ్మెల్యే వేముల వీరేశం ప్రేమగా స్వీట్ తిన్పించాలని ఆ బాక్స్ తెరిచి తిన్పిస్తుంటే తినకుండా.. తానే ముందుగా అందులో ఓ చిన్న ముక్క తీసుకోని రేవంత్ తిన్నారు.
వీరేశం తిన్పిస్తుంటే వద్దన్నట్లుగా తినకుండా అతని చేయిని పక్కకు నెట్టారు. దీనిపై నెటిజన్లు రేవంత్ రెడ్డికి ముందు నుండి దళితులంటే చులకనా.. అందుకే నిన్న అలా.. ఇవాళ ఇలా వ్యవహారించారు అని సెటైర్లు వేస్తున్నారు.