రేవంత్ రెడ్డి కంటే కేసీఆరే బెటర్-శాసన మండలి చైర్మన్.!

Gutha Sukender Reddy Chairman of the Telangana Legislative Council
ముఖ్యమంత్రి ఎనుముల రేవంత్ రెడ్డి పాలన లో కంటే మాజీ ముఖ్యమంత్రి కేసీఆర్ పాలనలో ఏదైన ప్రభుత్వ కార్యక్రమం ఉంటే ప్రజాప్రతినిధులకు గౌరవం బాగుండేది. కేసీఆరే స్వయంగా ఫోన్ కాల్ చేసి ఆహ్వానించేవారు.
అంతేకాకుండా చివరికి అటెండర్ ద్వారా ఆహ్వాన పత్రిక ఇచ్చి మరి ఇంటికి పంపించేది. కానీ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారంలోకి వచ్చాక మమ్మల్నే పిలవడం లేదని కౌన్సిల్ లో దేవాలయాలపై జరిగిన చర్చలో మండలి చైర్మన్ గుత్తా సుఖేందర్ రెడ్డి వ్యాఖ్యానించారు.
చర్చలో భాగంగా మంత్రి కొండా సురేఖ మాట్లాడుతూ యాదాద్రి ఆలయం మీరు నిర్మిస్తే ప్రారంభించే భాగ్యం మాకు దక్కింది. కాకపోతే ఆరోజు నేను పోలేదు. మా బంధువుల్లో ఒకరూ చనిపోతే చుట్టు వల్ల నేను పోలేకపోయాను అని వివరించారు. దీనికి బదులుగా మండలి చైర్మన్ మాట్లాడుతూ అప్పుడు నన్ను కూడా పిలవలేదు అని పైవిధంగా వ్యాఖ్యానించారు.
