తెలంగాణ సీఎస్ గా ఆర్కే..!

RK as Telangana CS..!
తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా ఉన్న శాంతికుమారి పదవీకాలం వచ్చే ఏఫ్రిల్ నెలతో ముగియనుంది.
ఈ నేపథ్యంలో తదుపరి సీఎస్ గా ప్రస్తుతం ఫైనాన్స్ సీఎస్ గా ఉన్న కె.రామకృష్ణారావు పేరును ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి నాయకత్వంలోని కాంగ్రెస్ ప్రభుత్వం ఖరారు చేసినట్లు తెలుస్తోంది.
1980 బ్యాచ్ కు చెందిన ఈయన గత కొన్నాళ్లుగా ఆర్థిక శాఖ ప్రత్యేక ప్రధాన కార్యదర్శిగా ఉన్నారు. రామకృష్ణారావు పదవీకాలం ఈ ఆగస్టుతో ముగియనుంది. ఈయన తెలంగాణ ఏర్పడినప్పటి నుంచి 12 బడ్జెట్లను రూపొందించి రికార్డు సృష్టించారు.
